telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు గుడ్ న్యూస్ : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1650 తగ్గడంతో రూ. 53,600 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1500 తగ్గడంతో రూ. 49, 150 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1640 తగ్గడంతో రూ. 51,380కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1500 తగ్గడంతో రూ.47,100 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 3500 తగ్గింది. దీంతో వెండి ధర రూ.61,900కు చేరింది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌ లో బంగారం, వెండి ధరలు తగ్గడం అందరికి లాభమేనని విశ్లేషకులు అంటున్నారు.

Related posts