telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముంబై జట్టు లో నెంబర్ వన్ బాట్స్మెన్ గా కిషన్..

ముంబై ఇండియన్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. నిన్న జరిగిన ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ధేశించిన 157 పరుగుల టార్గెట్‌ ను సునాయాసంగా ఛేదించి కప్పు కైవసం చేసుకుంది. అయితే ముంబై జట్టు విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన కీలక ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ కూడా ఒకడు. ఈ ఈఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి రోహిత్ తో సహా ముంబై జట్టులోని టాప్ బ్యాట్స్మెన్స్ అందర్నీ దాటేసి… ఈ ఏడాది ఐపీఎల్ లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2020 లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన కిషన్ 516 పరుగులు సాధించగా.. ఆ తర్వాత డికాక్ 503, సూర్య కుమార్ యాదవ్ 480 పరుగులు చేయగా హిట్ మ్యాన్ మాత్రం కేవలం 332 పరుగులు చేసి 4వ స్థానంలో నిలిచాడు. అయితే తన జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మొదటి స్థానాల్లో నిలిచిన కిషన్ మొత్తం ఐపీఎల్ లో చూస్తే 5వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో మొదట రేసు మ్యాచ్ లకు దూరంగా ఉన్న కిషన్ ఆ తర్వాత ఆడిన మొదటి మ్యాచ్ లోనే 99 పరుగులు సాధించి.. జట్టులో తన స్థానాన్ని స్థిరం చేసుకున్నాడు.

Related posts