telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా జీవితంలో సెప్టెంబర్ 22కు చాలా ప్రాముఖ్యత ఉంది : చిరంజీవి

chiru

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి, నటనకు, డ్యాన్స్ కు ప్రత్యేకంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తనదైన నటనతో డ్యాన్స్ లతో డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకుల మనసులను గెలుగుచున్నాడు మెగాస్టార్. చిరంజీవి వెండితెరకు పరిచయమై ఈ రోజుకు సరిగ్గా 42 సంవత్సరాలు పూర్తైంది. ఆయన నటించిన మొదటి సినిమా ప్రాణంఖరీదు ఈ రోజున (సెప్టెంబర్ 22న 1978 )లో రిలీజ్ అయింది. కే.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని క్రాంతి కుమార్ తెరకెక్కించారు. జయసుధ హీరోయిన్ గా నటించింది. రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఘన విజయం అందుకుంది.
తన జీవితంలో సెప్టెంబర్ 22కు చాలా ప్రాధాన్యం ఉందంటూ చిరంజీవి సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ చేశారు. “నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యం ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబర్ 22 నటుడిగా `ప్రాణం (ఖరీదు)` పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన అభిమానులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక నటనపై మక్కువతో 1976లో మద్రాసు వచ్చి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ స్కిల్స్‌లో డిప్లొమో పట్టా పొందారు మెగాస్టార్. మొదటి సినిమాకి అక్షరాల 1,116 రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు చిరంజీవి. ట్విట్టర్ లో “42 ఇయర్స్ మెగాలెగసి” అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్.

Related posts