telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుడిగాలి సుధీర్ అందులో వీక్ అంట… ‘త్రీ మంకీస్’ ట్రైలర్

3

జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా, కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించిన ‘త్రీ మంకీస్’ చిత్రాన్ని ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి.దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ‘త్రీ మంకీస్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం నాడు బ్రహ్మానందం చేతుల మీదిగా విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఫణిగా గెటప్ శీను, ఆనంద్‌గా రాంప్రసాద్, సంతోష్‌గా గెటప్ శీనులు నటించారు. రెండు నిమిషాలు నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో ఫన్‌ అండ్ రొమాన్స్‌తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. ఓ పాప లైఫ్ కోసం ఈ ‘త్రీ మంకీస్’ ఏం చేశారన్న కథాంశంతో చిత్రాన్ని రూపొందించినట్టుగా ట్రైలర్‌‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ తాజా ట్రైలర్‌‌‌ ను మీరు చూడిండి.

Related posts