telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

నేటి నుంచి సామాన్యు ప్రజలకు టీకా..

ఇవాళ్టి నుంచి రెండో విడత “కోవిడ్” వాక్సినేషన్ ఇవ్వనున్నారు. అయితే.. నేటి నుంచి సామాన్యులకు కూడా టీకా వేయనున్నారు. 60 ఏళ్ల పైబడిన వారు, 45 ఏళ్ళు పైబడి కోమార్బిట్ సమస్యలు ఉన్న వాళ్లకు టీకా ఇవ్వనున్నారు. 10 గంటలకు తెరుచుకొనున్న కొత్త కోవిడ్‌ సాఫ్ట్వేర్.. అప్పటి నుంచే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఇవాళ తెలంగాణలోని 48 ప్రభుత్వ, 45 ప్రయివేట్ ఆస్పత్రుల్లో టీకా పంపిణీ చేయనున్నారు. దశల వారీగా వాక్సిన్ కేంద్రాలను పెంచనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక హుజురాబాద్ లో టీకా వేసుకోనున్నారు మంత్రి ఈటల రాజేందర్‌. ఒక్కో కేంద్రంలో 200 ల మందికి టీకా వేయనున్నారు. టీకా ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.

Related posts