telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నిరాడంబరంగా బాలయ్య జన్మదిన వేడుకలు.. హాజరైన చంద్రబాబు

Balakrishna Birth day

సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకున్నారు. తన పుట్టినరోజును బాలయ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో అభిమానులు కూడా ఎవరి ఇళ్లలో వారే వేడుక జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు వస్త్రాలను ధరించారు. తొలుత హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రి వద్ద ఉన్న తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం ఆసుపత్రిలో బర్త్ డే కేక్ ను కట్ చేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బావ చంద్రబాబు నాయడు, సోదరి నారా భువనేశ్వరి, భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి హాజరయ్యారు. త్వరలో సినీ ఆరంగేట్రం చేయనున్న మోక్షజ్ఞ కూడా వేడుకల్లో పాల్గొన్నాడు.

Related posts