telugu navyamedia
రాజకీయ

రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగింది..షెడ్యూల్​ను వెల్ల‌డించిన‌ ఈసీ

రాష్ట్రపతి ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో పోలింగ్‌ జరగుతుందని సీఈసీ చెప్పారు. ఎన్నిలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని వివరించారు.

ఓటింగ్ ప్రక్రియలో ఎన్నికల అధికారులు ఇచ్చే పెన్నును మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఈ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ ఎంపీ, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదని స్పష్టం చేసింది. నామినేషన్ వేసే అభ్యర్థిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొంది. ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431 అని సీఈసీ తెలిపారు.

రాష్ర్ట‌ప‌తిఎన్నికల షెడ్యూల్​ ఇదే..

*జూన్‌ 15న నోటిఫికేషన్ విడుదల
*జూన్​ 29 వరకు నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ
*జూన్​ 30న నామినేషన్‌ పరిశీలన
*జూలై 2న‌ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
*జూలై 18న రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌లు..
*జులై 21న ఓట్ల లెక్కింపు
*జులై 25 కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం

Related posts