telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గ్రేస్ మార్కులు వేస్తే..లోకేష్‌, ప‌వ‌న్‌లా త‌యార‌వుతారు ..

టెన్త్ ఫెయిలైన విద్యార్ధులను ఆత్మహత్యలు చేసుకునేలా నారా లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఇలాంటి ప‌నులు చేయోద్ద‌ని చెప్ప‌డానికి లోకేష్ నిర్వ‌హించిన జూమ్ మీటింగ్‌లో చేరాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.

టెన్త్ క్లాస్ విద్యార్ధులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవేంద‌ర్ రెడ్డిలు ప్రత్యక్షమయ్యారు.

ఈ విషయమై మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా వ‌ల్ల 8,9 త‌ర‌గ‌త‌లు స‌రిగా జ‌ర‌గ‌లేదు. దీంతో పాస్ ప‌ర్సంటేజ్ త‌గ్గిపోయింది. కానీ దీనిని కూడా ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయంగా వాడుకుంటున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్ధులు మ‌ళ్ళీ ప‌రీక్ష రాస్తే డైరెక్ట్‌గా పాసైన‌ట్లు స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని అన్నారు.

పిల్లలకు స్టాండర్డ్ లేకుండా పై తరగతులకు పంపిస్తే వాళ్లే నష్టపోతారన్నారు. పిల్ల‌ల‌కు ప‌ది గ్రేస్ మార్కులు వేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేస్తున్నారు. గ్రేస్ మార్కులు ఎందుకు? గ్రేస్ మార్కులు వేస్తే వారు కూడా లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా త‌యార‌వుతార‌ని అన్నారు.

కరోనా సమయంలో స్కూళ్లు మూసేయాలని ఆందోళన చేసిన టీడీపీదే ఈ పాపం కొడాలి నాని అన్నారు. మా మేనల్లుడు యాప్ లింక్ ద్వారా తాను జాయిన్ అయ్యాయన్నారు. తాను కనపడగానే జూమ్‌ మీటింగ్‌ కట్‌ చేసి పారిపోయారని అన్నారు. అధికార పార్టీకి చెందిన వర్షన్ ను ఎందుకు వినలేదని ఆయన అడిగారు .

లోకేష్ ఏమైనా పులా, సింహాం. డైరెక్టుగా చర్చలకు వెళ్లకపోవడానికి ఆయన అడిగారు. విద్యార్థులను పిలిచి మరోసారి చర్చ పెట్టమనండని, తాము వెళ్తామని అన్నారు. తన ప్రశ్నలకు లోకేష్‌ సమాధానం చెబితే బాగుండేదని విమర్శలు చేశారు.

విద్యార్థులు నెల రోజుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిస్తే సప్లిమెంటరీ పరీక్షల్లో కాకుండా డైరెక్టు పరీక్షల్లో పాసైనట్టుగా సర్టిఫికెట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్, పన్ కళ్యాణ్ మాటలను విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను పట్టించుకోవద్దని ఆయన కోరారు.

Related posts