telugu navyamedia
రాశి ఫలాలు

దిన ఫలితాలు : మే 2 గురువారం రాశిఫ‌లాలు.

మేషరాశి..

వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి.

వృషభరాశి..

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

మిథునరాశి..

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటకరాశి..

ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

సింహరాశి..

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి.

కన్య రాశి..

పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో పరిస్థితి కలుగుతుంది.

తులరాశి.

భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు వృత్తి వ్యాపారములు పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికరాశి..

వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది..

ధనుస్సురాశి..

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులుతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేయడం వలన మానసిక అశాంతి కలుగుతుంది.

మకరరాశి..

గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

కుంభరాశి..

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.

మీనరాశి..

గృహంలో శుభకార్యాలు పరమైన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని అధిగమించి లాభాల అందుకుంటారు.

Related posts