telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశి వారి ఆరోగ్యం జాగ్రత్త

Today Rasi Phalalu

మేష రాశి
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. పెండింగ్ లోగల ఇంటి పనులు కొంత వరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. మీరు జీవితానికి సాఫల్యత ను సాధించబోతున్నారు, దీనికోసం మీరు, ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీలో కొంతమంది దూరప్రయాణానికి సిద్ధమవుతారు, బాగా అలసట ఉన్న కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది.

వృషభ రాశి
మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీ విలువైన కాలాన్ని మీపిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం!

మిథున రాశి
పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకొని, రిలాక్స్ అవడానికి ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ శ్రీమతితో మాట్లాడి, పెండింగ్ లో గల ఇంటిపనులను ముగించడానికి ఏర్పాటుచేయండి. ఒక రొమ్మన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి- కానీ స్వల్పకాలికం మాత్రమే. ఆఫీసులో ఈ రోజు మీదే కానుంది! మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.

కటక రాశి
సమయానుసారంగా కొంత పనిచేయలేనితనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పని తీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యను అవసరమౌతాయి. ఇలాంటప్పుడు అలసత చూపితే, తరువాత భారీ మూల్యం చెల్లించ వలసి వస్తుంది. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. భాగస్వామ్య ప్రాజెక్ట్ లు సానుకూల ఫలితాలను కంటే, వ్యతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి- ప్రత్యేకించి, ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకోనిచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.

సింహరాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు, ఆమెకలవగానే,కళ్ళు సంతోషంతో, చమక్కు మంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. సంతృప్తికరమైన ఫలితాలకోసం చక్కగా ప్లాన్ చేసుకొండి. మీరు మరి ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లనే మబ్బులు క్రమ్ముతాయి. ఒప్పుకున్న నిర్మాణపనులు మీ సంతృప్తిమేరకు పూర్తి అవుతాయి. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు.

కన్యా రాశి
అతి విచారం, వత్తిడి, మీ మానసిక ప్రశాంతతను కలత పరుస్తాయి.ప్రతి ఆతృత యొక్కనిస్సహాయత, ఆందోళన, శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకొండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.- ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. స్వర్గం భూమ్మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు.

తులా రాశి
డిప్రెషన్ లేదా క్రుంగుబాటు సమస్యకి, సమస్యా పరిశ్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. మీరు చేసిన పనులకు, మరెవరో పేరుగొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలనూ తెలివిగా పరిష్్కరించుకుంటారు.

వృశ్చికరాశి
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మీకు మరుసటిరోజు ఉదయాన్ని అప్ సెట్ చేయగలదు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీనిగురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.

ధనుస్సు రాశి
మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. పోటీ రావడం వలన, పని తీరికలేకుండా ఉంటుంది. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు.

మకర రాశి
చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. మీ సోదరి పెళ్ళిసంబంధం వార్త మిమ్మల్ని ఆనందపర్స్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు. కానీ, భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి, మనసుకు నచ్చుతారు. ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు.

కుంభరాశి
బాగా బలమైన, క్రొవ్వు గల ఆహారపదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండీ. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది. ఈ వార్తను కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను పంచడంద్వారా కూడా షక్తిని పుంజుకోవచ్చును. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్ సెట్ అవుతారు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు.

మీన రాశి
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్ళలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. మీభార్యతో సఖ్యతనెరిపే బహుమంచిరోజిది. ఒక కుటుంబంలో మసిలే ఇద్దరిమధ్యన, సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి, వారిబంధుత్వంలో చోటుచేసుకోవాలి. వారు బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి, నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగిం చాలి. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకొండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. అయినా సరే, ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది.

Related posts