telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : … ఆర్థికంగా కలిసివస్తుంది.. కుటుంబసౌఖ్యం..

today rasi falalu

మేషం : ఈ రోజు స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. కొత్తస్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణంకానీ చేస్తారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. చర్చలు సఫలమవుతాయి.

వృషభం : ఈ రోజు వాయిదాపడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పైఅధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీమిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

మిథునం : ఈ రోజు రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటంకానీ, ఇల్లు సర్దటంకానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒకసంఘటన కారణంగా మీమనసు చెదురుతుంది. ఆర్థికనష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులోఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

సింహం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవితభాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యవిషయంగా లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

కన్య : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమిసంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూలదినం. మీమాటనెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవితభాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన కొనుగోళ్లు చేస్తారు. వాయిదాపడుతున్న పనులు పూర్తవుతాయి.

తుల : మీపిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీప్రేమను మీరుప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియనిచి న్నఆందోళన మనసులోఉంటుంది. మీభావోద్వేగాలను అదుపులోఉంచుకోవాలి. కాంపిటేటీవ్ పరీక్షలు రాస్తున్నవారు విజయం సాధిస్తారు.

వృశ్చికం : ఈ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలవైనప్పటికీ బయటకెళ్లటం కంటే ఇంట్లో కుటుంబసభ్యులతో గడపాలని కోరుకుంటారు. గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలదినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయటం కానీ, మిత్రులను కలవటం కానీ చేస్తారు. అలాగే వాహనాలు కొనుగోలు కానీ, రిపేర్ చేయించడం కానీ చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశ ముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైనపడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపారలావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

కుంభం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలోపాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దానికారణంగా కుటుంబసభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతోకానీ వివాదంజరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూలదినం కాదు. మీతల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

Related posts