telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 16, గురువారం రాశిఫలాలు..

మేషరాశి..

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువుల‌తో విభేదాలు లేవు. ఆరోగ్యపరమైన చికాకులు. సోదరులు, మిత్రుల కలయిక . వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు.

వృషభరాశి..

ఆలోచనలు కలసివస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో ఒంప్పందాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి.దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

మిథునరాశి..

ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబంలో చికాకులు మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటుకాగలదు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు చేస్తారు.

కర్కాటకరాశి..

పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.బంధువుల రాకతో అనుకోని ఖర్చులు, పెరిగిన అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి.

సింహరాశి..

పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. శ్రమ వృథా కాదు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

కన్యరాశి..

వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ప్రమేయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. కార్యక్రమాలలో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొత్తగా అప్పులు చేస్తారు. ద‌గ్గ‌ర బంధువుల‌తో కలహాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. ఆర్ధిర ప‌రంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగులకు ప‌ని ఒత్తిడి ఎక్కువ‌వుతుంది.

తులరాశి..

శత్రువులు మిత్రులుగా మారతారు. బంధువుల ఇంటికి రావ‌డంతోఇల్లు సంద‌డిగా మారుతుంది. సోదరులు, స్నేహితులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. రాబడి అంతగా కనిపించదు. ఆరోగ్య సమస్యలు ఎదుర‌వుతాయి. వ్యాపారాలు ఒడిదుడుకులతో సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు ఏర్ప‌డ‌తాయి.

వృశ్చికరాశి..

కొత్త కార్యక్రమాలకు ముందడుగు వేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. . వ్యాపారాలు ఊపుందుకుంటాయి. ఉద్యోగులకు ప్ర‌మోష‌న్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. విదేశీ చదువుల కోసం చేసే యత్నంలో ఏజెంట్లు, బ్రోకర్లతో జాగ్రత్త వ్య‌వ‌హారించ‌డం మంచిది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యం సాధిస్తారు.

ధనుస్సురాశి..

చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి అనుకున్న ఫ‌లితాలు ల‌భిస్తాయి.

మకరరాశి..

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి తప్పులు పడటం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో మాట‌ప‌ట్టింపులు ఎదుర‌వుతాయి. వ్యాపారులకు నిరుత్సాహం క‌లుగుతుంది. ఉద్యోగులకు ట్రాన్స్ ఫ‌ర్‌లు అవుతాయి. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

కుంభరాశి..

వస్తు, వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతర కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య‌మైన‌ కార్యక్రమాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. విలువైన వ‌స్తువుల‌ను భ‌ద్రంగా వ‌హించ‌డం మంచిది. అనారోగ్య బారిన ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వ్యాపారాలు ల‌భాలు అంత‌గా క‌లిసిరావు.

మీనరాశి..

కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అదనపు ఆదాయం చేకూరుతుంది. సన్నిహితుల శుభ‌వార్త‌లు వింటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార రంగాల వారికి కాలం మంచిగా లేదు.

Related posts