telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. స్నేహితులతో సరదాలు.. ప్రేమ వ్యవహారాలు..

today rasi falalu

మేషం : ఈ రోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే కొత్తగా ఏదైనా పని ప్రారంభించటానికి కూడా అనువైన రోజు. గృహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.ఉద్యోగం మార్పు విషయంలో మీరు ఎదురుచూస్తున్న ఫలితం దక్కుతుంది.

వృషభం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఏదైనా దూర ప్రదేశానికి కానీ, ఆధ్యాత్మిక కేంద్రానికి కాని వెళ్లి ప్రశాంతంగా గడపాలి అన్న ఆలోచనను కలిగి ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజు కాదు. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బందికి లోనవుతారు.

మిథునం : ఈ రోజు ఒక సంఘటన మీ మనసు చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా మీ పనులు చేసుకోవటం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు.

కర్కాటకం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్త పరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూల దినం.

సింహం : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. లోన్‌ లేదా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుంది.

కన్య : ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. సంతానం గురించి ఎదురు చూస్తున్నవారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

తుల : ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు తీసుకోవచ్చు.

వృశ్చికం : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, ట్రాన్స్‌ఫర్‌ కానీ ఉంటుంది.

ధనుస్సు : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు, తొందరపాటు మంచిది కాదు.

మకరం : ఈ రోజు ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, మిత్రులతో లేదా కుటుంబసభ్యులతో విహారం చేస్తారు. దుస్తులు కానీ, మీకు సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమానికి హాజరవుతారు. మీ అలవాట్లను అదుపులో ఉంచుకోవటం మంచిది.

కుంభం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్నపనికి అయినాఇతరులపై ఆధారపడటంకానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీచేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

మీనం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచిలాభాలు గడిస్తారు. మీసంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్తస్నేహాలు, పరిచయాలుఏర్పడుతాయి. ప్రేమవ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

Related posts