telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోవాలి: స్మృతి ఇరానీ

Minister Smruti Irani Ladies development

మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతికతపై ఆసక్తి పెంచుకోవాలని ఆమె సూచించారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ)లో భాగంగా శనివారం మహిళా సైన్స్ కాంగ్రెస్‌ను స్మృతి ఇరానీ ప్రారంభించారు. మహిళా సైన్స్ కాంగ్రెస్ సావనీర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మహిళాసాధికారతపై మాట్లాడుతూ సైన్స్‌తో భవిష్యత్‌కు భారత్ బాటలు వేస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో మహిళలకు అపార అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. తాను జౌళిశాఖ మంత్రిగా కాకుండా ఒక మహిళాప్రతినిధిగా ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. లింగ అసమానత్వం మహిళల సమస్య మాత్రమే కాదన్న ఆమె.. దానిని నిర్మూలించేందుకు పురుషులు సైతం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అప్పుడే ఆడబిడ్డలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వ డం సాధ్యమవుతుందన్నారు.

Related posts