telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నా మనసు

నేను ఉన్నాను ఈ లోకంలో
ఉన్నానంటే ఉన్నాను…
జీవం ఉందా అంటే చెప్పలేను
కాని కదులుతూ ఉన్నాను…
ప్రాణముందా అని అడగవద్దు
మీ ముందు కనిపిస్తున్నాగా…
మాట్లాడవా అనకు
మనిషిగా మౌనం
మనసుగా శూన్యం…
కనులకు చూపుంది
కాని చూడాలనే చూపే లేదు….
మనసుకు ఊహలుండేవి
నీతోనే అన్నీ అవిరైపోయాయి….
కరిగనీ నేను
కరిగిపోయే కలలా మిగిలిన్నాను…
మనిషిగా చావలేక
మనసుగా బ్రతకలేక
నడి మధ్యలో ఈ నరకయాతనలో
ఊగిసలాడుతూ పోరాడుతున్నా
నా *మనసు* ఉనికి కై ….!!

Related posts