telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌తో నటుడు అలీ భేటీ

Ali comments Pawan Kalyan YCP

ప్రముఖ హాస్య నటుడు అలీ ఆదివారం ఉదయం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ నెల 9వ తేదీన అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం సాగుతుంది. అందుకు సంబంధించి పవన్ సలహాలు అడిగి ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్ ‌కు అలీ అత్యంత సన్నిహితుడు. నేడు పవన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వైసీపీలో అలీ చేరాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో అలీ భేటీ కావడం రాజకీయంగా కొత్త చర్చలకు తెరలేపింది.

Related posts