telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్ కు హైకోర్టు బ్రేకులు వేసింది : ఎంపీ వల్లభనేని

ap mp vallabhaneni write letter on

రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న “రాష్ట్ర ఎన్నికల సంఘం” రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తున్నారని, ఈ యాప్ ఎక్కడ తయారుచేశారో నిమ్మగడ్డ చెప్పాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.  గతంలో రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలోది అని చర్చ జరిగిందని, మాకు తెలిసినంత వరకు ఇది కూడా టీడీపీ ఆఫీస్ లో తయారైందని అన్నారు. హైకోర్టు ఎప్పుడు మొట్టికాయలు వేసినా మోషన్ మూవ్ చేస్తాడని, లంచ్ మోషన్ తర్వాత హైదరాబాద్ హయత్ హోటల్లో పచ్చ చొక్కాలతో కలిసి కాక్ టైల్ మోషన్ మూవ్ చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తులు రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హులా అని ప్రశ్నిస్తున్నానని అన్నారు. ఏకగ్రీవాలు చెల్లవు అని ఆయన అంటున్నారు. మన దేశంలో రాష్ట్రపతి పదవులకు కూడా ఏకగ్రీవాలు జరిగాయని బాలశౌరి పేర్కొన్నారు అలాగే నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్ కు హైకోర్టు బ్రేకులు వేసిందని అన్నారు. బాబును నమ్ముకుని పనిచేసిన ఏ వ్యక్తి బాగుపడలేదని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు చేసిన గొడవలు ఈయనకు పట్టవని పేర్కొన్నారు.  టీడీపీ నేతలు అమిత్ షాను కలిసి తప్పుడు ప్రచారాలు, పాత వీడియోలు చూపించారని,  బాబు హయాంలో ధ్వంసం చేసిన పాత వీడియోలు షాకు చూపించారని అన్నారు.

Related posts