విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు.
కోడికత్తి కేసు హైకోర్టులో విచారణ జరుగుతుండగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. న్యాయపరంగా ఎలా వెళ్ళాలనే దానిపై చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు డీజీపీ ఠాకూర్, ఏజీ, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు హారజరయ్యారు.