telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

2డీజీ డ్రగ్ : మార్గదర్శకాలు విడుదల చేసిన డీఆర్‌డీవో

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కరోనా కట్టడికి ఇప్పటికే వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఈ వ్యాక్సిన్ల డోసులు ఎవరికి అందటం లేదు. దేశంలో వ్యాక్సిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తాజాగా డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. ఆ మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

మార్గదర్శకాలు :
ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల‌కు ఇస్తున్న చికిత్స‌కు అనుబంధంగా ఈ ఔష‌ధం అత్య‌వ‌సర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది.
ఈ 2డీజీ ఔష‌ధాన్ని గ‌ర్భిణులు, బాలింత‌లు, 18 ఏళ్ల లోపు పేషెంట్ల‌కు ఇవ్వ‌కూడ‌దు.
మోస్త‌రు నుంచి తీవ్ర కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా డాక్ట‌ర్లు ఈ మందును ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది. గ‌రిష్ఠంగా ప‌ది రోజుల పాటు దీనిని వాడొచ్చు.
నియంత్ర‌ణ లేని డ‌యాబెటిస్‌, తీవ్ర‌మైన‌ గుండె జ‌బ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారిపై ఈ ఔష‌ధాన్ని ఇంకా పూర్తిగా ప‌రీక్షించి చూడ‌లేదు. అందువ‌ల్ల కాస్త ముందు జాగ్ర‌త్త అవ‌స‌రం.
[email protected]కు మెయిల్ చేయ‌డం ద్వారా హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ను 2డీజీ ఔష‌ధం స‌ప్లై చేయాల‌ని పేషెంట్లు, వాళ్ల అటెండ‌ర్లు ఆయా హాస్పిట‌ల్స్‌ను కోర‌వ‌చ్చు.

Related posts