telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎక్స్‌పైరీ డేట్” వెబ్ సిరీస్ ట్రైలర్

Expiry Date

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “ఎక్స్‌పైరీ డేట్”. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మించింది. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి బైలింగ్వల్ వెబ్ సిరీస్ ఇది. అక్టోబర్ 2న ‘జీ 5’లో హిందీ వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదల చేశారు. ఈ నెల 9న తెలుగు వెర్షన్ విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. డిసెంబర్ 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన వైఫ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో టోనీ లూక్ కంప్లైంట్ ఇవ్వడం తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.‌ తన భర్త కనపడడం లేదని మరో మహిళ కంప్లైంట్ ఇస్తుంది. అతడు కూడా అదే పెళ్ళికి వెళతాడు.‌ వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? లవ్ ఎఫైర్లు, చీకటి సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Related posts