telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా ఉందన్న అనుమానంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

suicide

కరోనా వచ్చిందనే అనుమానంతో జిల్లా స్థాయి రిటైర్డ్‌జడ్జి మనస్తాపం చెందారు. సూసైడ్‌నోట్‌ రాసి తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్‌ పోలీ‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం మియాపూర్‌ న్యూసైబర్‌వ్యాలీలోని నవనామి ఎలైట్‌ ప్లాట్‌ నెంబర్‌ 302లో రాజీవ్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాజీవ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి అదే ప్లాట్‌లో ఓ గదిలో ఒంటరిగా ఉండేవాడు. శుక్రవారం జడ్జి రామచంద్రారెడ్డి తన గదిలో నిద్రపోయాడు.

అనంతరం  రాజీవ్‌రెడ్డి తల్లి గది తలుపుతీసి చూడగా రామచంద్రారెడ్డి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాసిన సూసైడ్‌నోట్‌లో తనకు కరోనా సోకినట్లు అనుమానంగా ఉందని తన వల్ల కుటుంబ సభ్యులు ఎవరూ ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Related posts