telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది…

ఉత్పత్తిపరంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని తెలిపారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్.. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అసత్యాలు చెబుతోందని ఆరోపించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ఉత్పత్తి , సేల్స్ పెరిగాయన్నారు.. కరోనాను ఎదుర్కొంటూనే గడిచిన నాలుగు నెలల్లో రూ. 800 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చిందని.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్‌కు రూ. 1200 కోట్ల ఉత్పత్తి లాభాలు వచ్చాయని వెల్లడించారు.  ఆదాయం సమకూరుస్తున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తామంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు అయోధ్య రామ్.. ప్లాంట్ ప్రైవేటీకరణకి నిరసనగా రేపు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తామని.. ఈ నెల 4న ఆర్కే బీచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీచ్ వాక్ ను నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ పరి రక్షణ కోసం పోరాడుతున్నాం.. కేంద్రం, విభజన హామీలు అమలు చేయలేదు.. సరికదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం దారణమని మండిపడ్డారు.

Related posts