telugu navyamedia
రాజకీయ వార్తలు

గ్యాస్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సీపీఐ నారాయణ

Narayana cpi

విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీపీఐ నారాయణ స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన సంస్థ అనుమతులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కూడా సస్పెండ్ చేయాలన్నారు.

దేశంలో పెట్రో ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘కరోనా’ లాక్ డౌన్ ల నేపథ్యంలో రేషన్ కార్డులున్నా, లేకున్నా ప్రతి వ్యక్తికి రూ.10 వేల నగదు, 20 కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి భౌతికదూరం పాటించాలన్న మోదీ ప్రభుత్వం, నిబంధనలను తుంగలో తొక్కి మద్యం దుకాణాలకు అనుమతులిచ్చిందని విమర్శించారు.

Related posts