telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తస్మాత్ జాగర్త!! చెప్పులలో .. కిలోల బంగారం..

two kilo gold in cheppal found

స్మగ్లింగ్ కి రోజుకో దారి కనిపెడుతున్నారు, దీనితో ఆయా అధికారులకు కూడా రోజుకు ఒక కొత్త అనుభవం వస్తుంది. తాజాగా, తన పాదరక్షల అడుగుభాగాన రెండు కిలోల బరువైన బంగారం బిస్కెట్లను తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని హైదరాబాద్, శంషాబాద్ ఆర్జీఐఏ అధికారులు పట్టేశారు. ఈ బంగారం విలువ దాదాపుగా రూ.66.2 లక్షలు ఉంటుందని డీఆర్‌ఐ అధికారి ఒకరు తెలిపారు.

నిన్న ఉదయం షార్జా నుంచి ఓ ప్రయాణికుడు 2 కిలోల బంగారంతో, మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ ఎయిర్ పోర్టులో దిగాడని, తన వద్ద ఉన్న బంగారాన్ని ఇండోర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన వ్యక్తికి అందించాడని వెల్లడించారు. ఆ వ్యక్తి రెండు బంగారం బిస్కెట్లను నాలుగు భాగాలుగా చేసి, తన చెప్పుల అడుగుభాగంలో పెట్టుకున్నాడని, విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వేళ, అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, బంగారం బయటపడిందని చెప్పారు. సాధారణంగా బంగారం అంటే మనకు లక్ష్మీదేవితో సమానం. అలాంటి బంగారాన్ని నడుము కింద అసలు ధరించకూడదు, అలా చేస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక చెప్పులలో పెట్టుకోవడం అంతవరకు సమంజసమో.., అది దొంగవ్యాపారం, అలాగే ఉంటుంది, కానీ దానిని కొని మనకి మనం సమస్యలు తెచ్చిపెట్టుకోకూడదు.. తస్మాత్ జాగర్త!!

Related posts