telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియుడితో నయన్ గొడవ… కారణం ఇదే…!?

Nayan

కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించిన “దర్బార్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా… నయన్ డైరెక్ట‌ర్ విఘ్నేశ్‌తో ప్రేమ‌లో ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య చెడింద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గతంలో శింబు, ప్ర‌భుదేవాల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన న‌య‌న త‌ర్వాత కొన్ని కారణాలతో వారిద్ద‌రితోనూ విడిపోయింది. “నాన్ రౌడీ థాన్” సినిమా స‌మ‌యంలో డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్‌తో న‌య‌న ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రూ డైరెక్ట్‌గా ఎక్కడా త‌మ ప్రేమ వ్య‌వ‌హారం గురించి చెప్పుకోలేదు కానీ.. ఇన్ డైరెక్ట్‌గా తాము ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప‌లు మార్లు తెలియ‌జేశారు. ఇప్పుడు వీరి మ‌ధ్య కూడా దూరం పెరిగింద‌ని టాక్ విన‌ప‌డుతుంది. వీరి గొడ‌వ‌కు కార‌ణం విఘ్నేశ్ శివ‌న్ పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకు రావ‌డ‌మేన‌ట‌. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవ‌డం న‌య‌న‌కు ఇష్టం లేద‌ట‌. పెళ్లిపై అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేసిన న‌య‌న‌పై విఘ్నేశ్ కోప‌గించుకుని వెళ్లిపోయాడ‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌లపై వీరి స్పందన తెలియాల్సి ఉంది.

Related posts