telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎయిర్‌పోర్టులో మామిడి పండ్లు దొంగతనం.. .అధికారులు ఏం చేశారంటే ?

Arrest

దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే పనిచేసే భారత వ్యక్తి బాగా దాహంగా ఉండడంతో పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడి బ్యాగు తెరిచాడు. అందులో అతడికి వాటర్ దొరకలేదు కాని మామిడి పండ్లు కనిపించాయి. దాంతో రెండు మామిడి పండ్లు తీసుకున్నాడు. వాటి ఖరీదు 6 దిర్హామ్(సుమారు రూ.116). ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రోజులాగే సెక్యూరిటీ గార్డు నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్న క్రమంలో అక్కడే పనిచేసే భారత వ్యక్తి ప్రయాణికుడి బ్యాగు నుంచి మామిడి పండ్లు తీసుకొని తినడం కనిపించింది. ఆ ఫుటేజీని సెక్యూరిటీ గార్డు ఎయిర్‌పోర్టు పోలీసులకు అందించాడు. దీంతో పోలీసులు 2018 ఏప్రిల్‌లో సదరు వ్యక్తికి సమన్లు పంపించి విచారించారు. ఆ తరువాత అతడిపై పండ్ల దొంగతనం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా నిందితుడిని పోలీసులు దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. దాంతో కోర్టులో భారత వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు. కాగా, ఈ కేసు తుది తీర్పును కోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది.

Related posts