telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిన్న నాకు చాలా ఎమోషనల్ డే… అందుకే మర్చిపోయా… : అనిల్ రావిపూడి

Anil-Ravipudi

‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ అనిల్ రావిపూడికి నిన్న బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా స్టార్ హీరో మహేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. మహేష్, అనిల్ కాంబోలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ రోజే ఆయన భార్య మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ‘‘నా డైరెక్టర్ అనిల్ రావిపూడికి బాబు జన్మించాడు. తల్లిదండ్రులిద్దరికీ కంగ్రాట్యులేషన్స్. బాబుకు నా ఆశీస్సులు’’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడికి ఒక కూతురు. అలాగే నిన్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. రెండూ ఇంపార్టెంటే కావడంతో ఆయన సమానంగా మేనేజ్ చేసుకున్నారు. ఈ మధ్యలో ఆయన తన మొదటి హీరో నందమూరి కల్యాణ్‌రామ్ గురించి మర్చిపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘వర్క్ పరంగానూ.. పర్సనల్ గానూ నిన్న నాకు చాలా ఎమోషనల్ డే. ఈ పరిస్థితిలో ఉండిపోయి నేను నా మొదటి హీరో కల్యాణ్ రామ్ గురించి ప్రస్తావించడం మరిచిపోయాను. ‘ఎంత మంచి వాడవురా’ టీమ్‌కి పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని అనిల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts