telugu navyamedia
సినిమా వార్తలు

న‌డిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేసిన హీరో విశ్వక్‌ సేన్‌..

*ప్రాంక్ వీడియోస్‌తో న‌డిరోడ్డుపై నానా హంగామా చేసినవిశ్వక్‌ సేన్‌

*రొడ్డుపై దొర్లుతూ అభిమాని విన్యాసాలు..
*డిబేట్ కోసం ఓ టీవీ ఛాన‌ల్‌ స్టూడియోకు వ‌చ్చిన హీరో విశ్వ‌క్‌సేన్‌..
*స్టూడియోలో అడ్డ‌దిడ్డంగా స‌మాధానాలు..
*లైవ్‌లోనే విశ్వ‌క్‌సేన్‌ ను బ‌య‌ట‌కు పంపిన యాంక‌ర్‌
*విశ్వ‌క్‌సేన్‌పై చీప్ ప్ర‌మోష‌న్స్‌పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు..
*హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేసిన ఆడ్వ‌కేట్ ఆరుణ్‌కుమార్‌..
*ప‌బ్లిక్ ఫ్లేస్‌లో న్యూసెన్స్ చేసిన విశ్వ‌క్‌సేన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు..

హీరో విశ్వక్‌ సేన్‌ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6 న రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టాడు విశ్వక్ సేన్.  

ఇక అందరిలా మనం కూడా ఇంటర్వ్యూ లు, ప్రెస్ మీట్లు పెడితే ఏం కిక్కు ఉంటుంది అనుకున్నాడో ఏమో ఈసారి ప్రమోషన్స్ ను కొత్తగా ప్రయత్నించాడు. మూవీ ప్రమోషన్లో భాగంగా అభిమాని ప్రాంక్‌ వీడియో చేయించారు. ఒక యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ హైదరాబాద్ ఫిలింన‌గ‌ర్ లో నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు.

విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వెళుతుంటే ఓ యువ‌కుడు కారుకు అడ్డంగా ప‌డుకొని న‌డిరోడ్డుపై పెట్రోల్ డబ్బా తో విశ్వక్ ను ఆ యువ‌కుడు(అల్లం అర్జున్) ఎక్కడ అని అడుగుతుంటాడు. అల్లం అర్జున్ నేనే అంటూ అతడిదిని సముదాయించ‌డానికి ట్రై చేస్తుంటాడు విశ్వక్ .

33 ఏళ్ళు అయ్యింది ఇంకా పెళ్ళి కాలేదు బ్రో..అర్జున్ కుమార్ అల్లానికి పెళ్లి కాకపోవడం ఏమిటి? అతడిని నా దగ్గరకు తీసుకురండి లేదంటే నన్ను అతడి దగ్గరకు తీసుకు వెళ్ళండి లేదంటే అంటించేయండి (ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నట్టు కలరింగ్ ఇస్తూ వాటర్ పోసుకున్నాడు) అంటూ రోడ్డు మీద రచ్చ రచ్చ చేశాడు.

అతడిని తన కారులో పంపిన విశ్వక్ సేన్, తాను ఆటో ఎక్కి వెళ్లిపోయారు. రెండు రోజులుగా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇంత దిగజారి ఆలోచించాలా అంటూ చిత్ర యూనిట్‌పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

ఇక ఈ ఫ్రాంక్ చేసిన‌ విశ్వ‌క్‌సేన్‌పై అడ్వొకేట్‌ అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని, బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

Advocate Arun Kumar Complaints On Vishwak Sen In HRC Over Prank Video - Sakshi

ప‌బ్లిక్ ఫ్లేస్‌లో న్యూసెన్స్ చేసిన విశ్వ‌క్‌సేన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు..అలాగే, పబ్లిక్ ప్లేస్‌ల‌లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూడాలని కోరారట. .

దీనిపై ఒక టీవీ ఛానల్ డిబేట్ పెట్టగా… విశ్వక్ సేన్ ఆ ఛానల్ స్టూడియోకి వెళ్లారు. ఛానల్ యాంక‌ర్‌కి, ఆయనకు మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. లైవ్‌లోనే విశ్వక్ సేన్ ను స్టూడియో నుంచి యాంక‌ర్ వెళ్ళ‌గొట్టింది.

Related posts