telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్న త్రిష..

trisha

తెలుగు, తమిళ్ లో మంచి పేరు సంపాదించుకుంది త్రిష. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ రెండు పరిశ్రమల్లో స్టార్ హీరోయినగా కొనసాగుతోంది. ఈ అమ్మడి కెరీర్ తుది దశకు వచ్చిందనకోగానే ఏదో ఒక ఆఫర్ రావడం, అది భారీ సక్సెస్ అందుకోవడం మళ్లీ త్రిష తన కెరీర్‌ను ముందుకు నడిపించడం జరుగుతున్న కథే. అయితే ఇటీవల త్రిష మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సారి ఓ రీమేక్ సినిమాలో త్రిష కనిపించనుంది. అది కూడా ఐదు సంత్సరాల క్రితం బాలీవుడ్‌లో విడుదలైన పీకు సినిమా రీమేక్‌ కానుంది. అందులోనే త్రిష ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి రెడీ అవుతుంది. ఈ రీమేక్‌ను తెలుగు, తమిళంలో రూపొందించనున్నారని సమాచారం. అయితే పీకు సినిమాలో దీపికా పదుకునే పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రను చేసేందుకు త్రిష ఓకే చెప్పింది. కానీ అమితాబ్ బచ్చన్ పాత్ర మరింత ఛాలెంజింగా ఉంటుంది. మరి అమితాబ్ ఛాలెంజ్‌ను ఎవరు చేయనున్నారో చూడాలి. ఈ పాత్రకు తెలుగు, తమిళం రెండు భాషల ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో సీనియర్ నటుల పేర్లు చర్చలో ఉన్నాయని. మరి ఎవరు ఓకే చెబుతారో వేచి చూడాలి. ఈ సినిమాతో త్రిష మరోసారి తనను తాను నటిగా నిరూపించుకుంటుందని, దీంతో పాటు ఖచ్చితంగా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందనుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రిషా మరెన్నేళ్లు కెరీర్‌ను కొనసాగిస్తుందో చూడాలి. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts