telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అందుకే ఆంటీలందరికీ నేను ఫ్యాన్ అయిపోయా… : ఆనంద్ మహీంద్రా

Anand-Mahindra

ముంబైకి చెందిన ఓ ఆకతాయి బైకర్ నిబంధనలకు విరుద్ధంగా ఫుట్‌పాత్‌పై బైక్ తోలాడు. ట్రాఫిక్ జంజాటం నుంచి తప్పించుకునే క్రమంలో అతడు ఈ విధంగా నిబంధనలకు నీళ్లొదిలాడు. ఇటువంటి వారి గురించి బాగా తెలిసిన ఓ వయోధికురాలైన మహిళ అప్పటికే ఫుట్‌పాత్‌పై అడ్డంగా నిలబడ్డారు. ఇలా చేయడం తప్పు అని అనిపంచలేదా? ఇతరులకు ప్రమాదకరం కాదా? అంటూ అతడు బైక్‌తో ఫుట్‌పాత్‌ను వదిలేదాకా ఆమె విడిచిపెట్టలేదు. ఈ మొత్తం ఉదంతాన్ని రోడ్స్ ఆఫ్ ముంబై అకౌంట్‌లో పోస్ట్ అవడంతో తెగ వైరల్ అయింది. ‘మేడం.. మీరు ముంబై మొత్తానికి ఆదర్శం. కానీ బైకర్‌లు ఇలా చేయడం చాలా సిగ్గు చేటు. ఇలాంటి వారి వల్ల సీనియర్ సిటిజన్లు కూడా ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి వచ్చింది. ఇది మరింత విచారకరం’ అని రోడ్స్ ఆఫ్ ముంబై వారు ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో సహజంగానే నెటిజన్లు ఆ మహిళకు ఫిదా అయిపోయారు. ఈ విషయం ఆనంద్ మహీంద్రా వరకూ వెళ్లడంతో ఆయన కూడా సదరు మహిళ తీరుకు అబ్బురపడ్దారు. ‘ఈ వీడియోను ఇప్పుడే చూశా. వెంటనే ఆంటీలందరికీ నేను ఫ్యాన్ అయిపోయా. ఇటువంటి స్త్రీలు మరింత పవర్‌ఫుల్‌గా అవ్వాలని ఆశిస్తున్నా. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళను కచ్చితంగా సన్మానించాలి. ఆంటీల ప్రతిభకు గుర్తుగా ప్రపంచ ఆంటీల దినాన్ని నెలకొల్పితే ఇంకా బాగుంటుంది. ఇటువంటి వారి వల్లే మన ప్రపంచం మరింత సురక్షింతంగా మారుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. ఆమె పేరు మిస్సెస్ గోఖలే. పుణెలోని విమలాబాయ్ గరవారే హై స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Related posts