telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు..నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

jagan

నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించింది. రిజర్వేషన్ల అమలుకు విధివిధానాలతో కూడిన నోటిఫికేషన్ ను జారీ చేసింది.

ఈ 50 శాతం రిజర్వేషన్లలో బీసీ, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ 50 శాతం రిజర్వేషన్లలో 50 శాతాన్ని మహిళలకు కేటాయించింది. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

Related posts