telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పీసీసీ నియామకంలో మరింత జాప్యం…

congress flags

పార్టీ అధిష్ఠానంకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక సవాల్ గా మారింది. పార్టీ అధిష్ఠానంకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. పీసీసీ బాధ్యతలు తనకే ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్జి వేంకటరెడ్డి. కానీ సుదీర్ఘకాలంగా పార్టీ లో ఉన్న సీనియర్లకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే ఈ ఎంపిక పై ఇంకా వివరాలు కోరుతున్నారు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ.  పార్టీని పటిష్టం చేసేందుకు నాయకుల బలాబలాలను వినియోగించుకునే నిర్ణయాలు తీసుకోనున్నారు సోనియా గాంధీ. అయితే ఇంకా సంప్రదింపుల పర్వం పూర్తి కాలేదంటుంది అధిష్ఠానం. మరింత లోతుగా, నిశితంగా సమాలోచనలు చేయాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉంది. ఇదే సమయంలో పార్టీ అధిష్ఠానం తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పీసీసీ నిర్ణయాన్ని వాయుదా వేసుకోవాలని జానారెడ్డి విజ్ఞప్తి చేసారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి విజ్ఞప్తి పై అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు పై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. జరిగే మార్పులు వల్ల నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పై ప్రభావం ఉండరాదనే అభిప్రాయం తో అధిష్ఠానం ఉంది. ఈ నేపధ్యంలో మరలా లోతుగా సమాలోచనలు చేసిన తర్వాతనే పీసీసీ పై నిర్ణయానికి రావాలని అధిష్ఠానం ఆలోచిస్తుంది.

Related posts