telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

శరన్నవరాత్రులు .. మహాలక్ష్మిగా .. అమ్మ ..

sarannavaratri utsav today as mahalakshmi

రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ రూపంలో దర్శనం ఇస్తుంది. అష్ట లక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని ఈమె వధించినట్లుగా పురాణాలు చెపుతున్నాయి. శక్తి త్రయంలో మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం గురించి చండీ సప్తసతి చెబుతోంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం – శ్రీరంగ ధామేశ్వరీం – దాసీ భూత సమస్త దేవ వనితాం – లోకైక దీపాంకురాం – శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం – త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ అందరు ఈ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఆరాదిస్తారు.

శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ధన ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి రూపాలలో శ్రీ మహాలక్ష్మి ని ఆరాధిస్తారు. మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడ్ని సంహరించింది. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సర్వమంగళాలు కలుగుతాయి. ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు ఈ రోజు జపించి ఎరుపు రంగు పుష్పములతో అమ్మని శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఆరాధించాలి. ఈరోజు అమ్మ వారికి నైవేద్యంగా శనగపప్పు వడలు బెల్లంతో కూడిన పొంగలి అమ్మకు సమర్పిస్తారు. ఈరోజును నిష్ఠగా పూజించిన వారికి శ్రీ మహాలక్ష్మి అన్నింటా విజయాలను ప్రసాదిస్తుంది.

Related posts