telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బోయపాటితో మెగా మేనల్లుడు…?

Sai Dharam Tej

పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి ధరమ్ తేజ్ మొదటి నుంచి హిట్ ట్రాక్ పై కొనసాగాడు. మధ్యలో కొన్నాళ్లు కెరీర్ డౌన్ అయినా నిరుత్సాహ పడలేదు. మళ్లీ చిత్రలహరి సినిమా నుంచి వరుస హిట్‌లు అందుకుంటున్నారు. ఇటీవల కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను రిలీజ్ చేసి మంచి కలెక్షన్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం సాయి తేజ్ దేవకట్టా దర్శకత్వంలో రిజబ్లిక్ అనే పొలిటికల్ డ్రామాను రూపొందిస్తున్నారు. దీని తరువాత సినిమా విషయంలో కూడా తేజ్ మంచి క్లారిటీగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. రిపబ్లిక్ సినిమా తర్వాత సాయితేజ్ పవర్ ఫుల్ డైరెక్టర్ బోయపాటితో ఓ సినిమా చేయనున్నారంట. అయితే బోయపాటి కూడా లాక్‌డౌన్‌లో మంచి కథను సిద్దం చేశారంట, దీనికి సాయి ధరమ్ తేజ్ బాగా సెట్ అవుతాడనిపించడంతో సంప్రదింపులు చేశారని టాక్ నడుస్తోంది. కథ బాగా నచ్చడంతో సాయి కూడా ఓకే చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీరి కాంబో గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. చుడాలిమరి ఈ సినిమా పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.

Related posts