జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో గాంధీ, గాడ్సే వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ స్పందించారు.
కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని పవన్ వెల్లడించారు.
పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు. ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను జనసేన అధికారిక పత్రం ద్వారా పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు.
అందుకే అసదుద్దీన్ ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్