telugu navyamedia
సినిమా వార్తలు

తల్లీకూతుళ్లుగా స్టార్ హీరోయిన్… భారీ ప్రాజెక్ట్ లో ద్విపాత్రాభినయం

ishwarya-Rai

ప్రముఖ దర్శకుడు మ‌ణిర‌త్నం ఈసారి భారీ బ‌డ్జెట్‌తో హిస్టారిక‌ల్‌ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌ల్కీ రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ థాయిలాండ్‌లోని దట్టమైన అడవుల్లో వందరోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జ‌రుపుకోనుంద‌ట‌. ఈ షెడ్యూల్‌లో స్టార్స్ అంద‌రు పాల్గొంటార‌ట‌. ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, మొత్తం 12 పాట‌ల‌ని ఆయ‌న రూపొందిస్తున్నార‌ట‌. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ క్లాసిక్ స్టైల్‌లో ట్యూన్స్ సిద్దం చేస్తున్న‌ట్టు టాక్. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు, ఐశ్వ‌ర్య‌రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప‌లువురు స్టార్స్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ తెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. బాలీవుడ్ చిత్రం ఫన్నే ఖాన్ తర్వాత కొత్త చిత్రంపై సంతకం చేయలేదు ఈ ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిదానంగా సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని అంగీకరించింది. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తల్ల్లీకూతుళ్లుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మందాకిని దేవి అనే మహారాణిగా, యువరాణి నందినిగా రెండు భిన్న పాత్రల్లో ఆమె కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఛోళ సామ్రాజ్య పతనానికి కారకురాలైన యువరాణి నందినిగా ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగనున్నట్లు సమాచారం. మూగ మహారాణిగా మందాకిని పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యరాయ్ పాత్రల ప్రధానంగానే ఈ కథ సాగనున్నట్లు సమాచారం.

Related posts