తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల్లో యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్ర్యూ ఫ్లెమింగ్, తెలుగులో ట్వీట్ చేశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “త్వరలో కేటీఆర్ గారిని యూకే తీసుకు వెళ్ళగలనని ఆశిస్తున్నా. అక్కడ బ్రిటిష్ వ్యాపారవేత్తలకు కూడా తెలంగాణ వ్యాపార విధానాలను వివరిస్తారని కోరుకుంటున్నా” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఇటీవల ఐఎస్ఐఎస్ అధికారులతో సమావేశమైన కేటీఆర్ కు చెందిన వార్త కథనాన్ని ఆయన జోడించారు.