telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఇందువదనా!

induvadana poetry corner

ఇందువదనా!
మనంలో మనమిద్దరం
విహరించే వలపుల తీరం
నీ ప్రణయామృత కనుదోయిలో
మరుమల్లెల పూస్తున్నాయి
మంచి గంధపు సమీరాలు
వీస్తున్నాయి
రెండు హృదయాల వసంతం
రేపటి వేకువకై
ఏకాంత పరిమళ ప్రణయ వేదం
నీ వుంటే నీ నేను
నేనుంటే నా నీవు
మధురమైన భావన
మంచి వారి దీవెన
ఇందువదనా!
ఈప్సితార్ధమదనా!
నీవే నా మధుర స్మృతుల
సుగంధం..
నీవే నా యుగ యుగాల
ప్రణయ ప్రబంధం..

-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి

Related posts