telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

బీజేపీ కంచుకోటలో… కాంగ్రెస్ తరపున .. కరీనా కపూరా… !

congress rafel campaign in social media

అధికార బీజేపీని గద్దె దించాలనే సంకల్పంతో కాంగ్రెస్ సహా దేశంలోని చాలా పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి తగినట్టుగా అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తుంది కాంగ్రెస్. దానిలో భాగంగానే బీజేపీ కంచుకోటలో పాగా వేసేందుకు సెలెబ్రిటీని రంగంలోకి దింపే యత్నం చేస్తుంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీని మట్టి కరిపించిన హస్తం పార్టీ.. అదే జోరును లోక్ సభ ఎన్నికలలోనూ కొనసాగించాలని కోరుకుంటోంది. అందుకే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను పోటీకి దించాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.

ఇక అధికార పక్షం ఉరక ఉంటుందా.. అసలు ఆమె ఎందుకు అని వివరంగా చెపుతూ .. విమర్శలు గుప్పిస్తుంది బీజేపీ. ఆ పార్టీ కి కంచుకోటగా ఉన్న భోపాల్ ను దక్కించుకోవాలంటే కరీనా లాంటి సెలబ్రిటీకి పోటీకి దించకతప్పదని కాంగ్రెస్‌ నాయకులు గుడ్డు చౌహాన్‌, ఆనీస్‌ ఖాన్‌ పార్టీ హైకమాండ్ కు వివరించినట్లు తెలుస్తోంది. అభిమానగణంతో పాటు భర్త సైఫ్ అలీఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్ గా పనిచేశారు. ఈ విషయాలన్నీ కలిసి పనిచేస్తే కాంగ్రెస్ కు విజయం తథ్యమని నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఎదుర్కొనే గట్టి నేతలు ఎవ్వరూ లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కరీనాను పోటీకి దించాలని చూస్తున్నారని కమలనాథులు విమర్శించారు.

Related posts