telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇండియన్-2″లో నటించడం లేదు…షాకిచ్చిన స్టార్ హీరో

mandi ad troubles vijay setupati

తమిళ ప్రేక్షకులు మ‌క్క‌ల్ సెల్వ‌న్‌గా పిలుచుకునే విజ‌య్ సేతుప‌తి ఇటీవ‌ల‌ తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న హీరోగా న‌టించిన 96 చిత్రం భారీ విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్‌లు చేస్తున్నారు. హీరో నుండి విల‌న్ వైపు యూట‌ర్న్ తీసుకున్న విజ‌య్ సేతుప‌తి ఒకవైపు హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూ, తమిళంతోపాటు పరభాషా చిత్రాల్లోనూ విలనిజాన్ని పండించేందుకు సిద్ధమవుతున్నారు. కోలీవుడ్‌ విషయానికొస్తే, ‘పేట్ట’ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు విలన్‌గా నటించిన సేతుపతి.. ప్రస్తుతం విజయ్‌ 64వ చిత్రంలోనూ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ‘ఇండియన్‌2’లోనూ కమల్‌తో కలిసి నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కమల్‌హాసన్‌ జన్మదిన వేడుకలో.. విశ్వనటుడితో కలిసి నటించే అవకాశం వచ్చిందని, అయితే అనివార్య కారణాలతో నటించలేకపోయానని సేతుపతి చెప్పారు. అయినప్పటికీ ‘ఇండియన్‌2’లో విజయ్‌ సేతుపతి నటిస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీంతో సేతుపతి స్పందిస్తూ, ‘ఇండియన్‌2’లో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. అయితే కమల్‌తో కలిసి నటించే అవకాశం వచ్చి, సమయం కలిసొస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు.

Related posts