telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేటి నుంచి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు

2nd group of indians shifted from china

నేటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కిట్లను కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపించింది. దీంతో, ప్రతిరోజు 30 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కిట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మంది కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారు.

నగరంలోని ఫీవర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రిలో వారిని ప్రత్యేక సదుపాయాల నడుమ వైద్యుల పరిశీలనలో ఉంచారు. వారి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. కాగా, వారిలో 11 మందికి కరోనా వైరస్‌ లేదని నమూనా పరీక్షలో నిర్ధారణ అయ్యింది. వైద్యులు వారిని డిశ్చార్జి చేశారు. మరో 8 మంది వివరాలు వెల్లడించాల్సి ఉందనీ.. ల్యాబ్‌ నుంచి నమూనాల ఫలితాలు రాగానే వారి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు.

Related posts