కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రం “మాస్టర్”తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడి టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా, మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. పైగా ఇంకా ఎలాంటి టీజర్ కూడా రాకుండానే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. భారీ ఓటిటి డీల్స్ వచ్చినా మేకర్స్ అటువైపు మొగ్గు చూపకుండా థియేటర్లోనే రిలీజ్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో విజయ్ “మాస్టర్” స్ట్రైక్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపడానికి టైం ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరి ఈ చిత్రం రిలీజ్ టైంకు పరిస్థితులు ఎలా ఉండనున్నాయి చూడాలి. ఇక “సర్కార్” “విజిల్” సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
previous post