telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిబంధనలు ఉల్లంఘించిన నభా నటేష్ నిర్మాతలు

Nabha-Natesh

ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేశ్ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో న‌టిస్తోంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ యూనిట్‌తో సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేయాల‌ని కోరార‌ట‌. అంతే కాకుండా హీరోయిన్ న‌భా న‌టేశ్‌ను బెంగ‌ళూరు నుండి హైద‌రాబాద్‌కు ర‌మ్మ‌ని గ‌ట్టిగా చెప్పార‌ట‌. ఇండ‌స్ట్రీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాన‌ని తెలిసినా న‌భా న‌టేశ్‌ ప్రొఫెష‌న‌ల్‌గా షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ షెడ్యూల్ వాయిదా ప‌డితే మ‌ళ్లీ కాల్షీట్స్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని భావించిన నిర్మాత‌లు త‌గు జాగ్ర‌త్త‌ల‌తో పాటు బెంగ‌ళూరు నుండి ప్ర‌త్యేక‌మైన మాస్కుల‌ను తెప్పించి యూనిట్ స‌భ్యుల‌కు ఇచ్చి షూటింగ్‌ను పూర్తి చేస్తున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం కరోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని, క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌కుండా.. అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా నిర్మాత‌ల మండ‌లి సినిమా షూటింగ్స్‌ను కొన్నిరోజుల పాటు వాయిదా వేసుకోవాల‌ని నిర్మాత‌ల‌కు సూచించింది. నిర్మాత‌ల మండ‌లి సూచ‌న మేర‌కు కొంత మంది నిర్మాత‌లు షూటింగ్స్‌ను, సినిమా రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకున్నారు. అయితే ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్‌ను నిర్మాత‌లు వాయిదా వేయ‌లేద‌ట‌.

Related posts