ప్రముఖ అమెరికన్ నటి, జుమాంటీ ఫేమ్ లారా బెల్ బండీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివరించింది బెల్ బండీ. ఈమె వయసు 38 ఏళ్లు కాగా గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, తలనొప్పి, చాతి నొప్పి, జ్వరంతో బాధపడుతున్నతాను.. అంతకంతకూ వ్యాధి తీవ్రత పెరగడంతో శ్వాసకోస సంబంధమైన సమస్యలు సైతం వచ్చాయని.. ఈ తరుణంలో కరోనా వైరస్‌పై సరైన అవగాహన లేక వ్యాధి నిర్థారణకు ఆలస్యం అయ్యిందని చెప్పారు. అయితే కరోనా పాజిటివ్ అని తేలినతరువాత స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాను. ప్రస్తుతం స్వీయ నిర్భందంలో ఉన్నాను.. పరిస్థితి అదుపులోనే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి వైద్యంతో పాటు మూలికలను తీసుకుంటున్నా. భయపడాల్సిన అవసరం లేదు.. దయచేసి ఎవరూ బయటకు రాకండి.. పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించండి. కరోనా వస్తే చనిపోతారనే భయం వద్దు.. సరైన ఆరోగ్య పరిరక్షణలు పాటిస్తే తిరిగి మామూలు మనుషులు అవ్వొచ్చు’ అంటూ తెలియజేశారు బెల్ బండీ.
previous post