telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

50 శాతం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ‘వర్క్​ ఫ్రమ్​ హోమ్​’

corona

కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌లో సగం మందిని ఇంటి నుంచే విధులు నిర్వర్తించమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగిలినవారు కార్యాలయాలకు హాజరుకావాలని పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి స్టేజ్-2 దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులలో 50 శాతం మంది ప్రతిరోజూ కార్యాలయానికి హాజరు కావాలి. మిగిలిన 50 శాతం సిబ్బంది ఇంటి నుండి పని చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఉద్యోగుల పని గంటలను మార్చాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ గురువారం తెలియజేసింది. రూపొందించిన జాబితా ప్రకారం ఒక నిర్దిష్ట రోజు ఇంటి నుండి పని చేయబోయే కేంద్ర ప్రభుత్వ అధికారులు, టెలిఫోన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల ద్వారా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి. ఏదైనా అత్యవసర పని కోసం పిలిస్తే, వారు కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుందని ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది.

Related posts