ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన “జెస్సీ ” సినిమాకు ఈరోజు సెన్సార్ అయ్యింది. అశ్వనీ కుమార్ దర్శకత్వంలో శ్వేతా సింగ్ రాథోడ్ నిర్మించిన ఈ సినిమాకు “ఏ ” సరిఫికేటును జారీ చేశారు . విక్టోరియా హౌస్ లో దెయ్యాలు ఉన్నాయో లేదో పరిశోదించడానికి శాలిని , అభి , మోజో , జో అనేవారికి దారిలో సమీరా అనే అమ్మాయి తోడవుతుంది . అందరు కలసి ఆ ఇంట్లోకి వెడతారు , ఆ తరువాత వారికి ఎలాటింటి భయానక సంఘటనలు ఎదురవుతాయి, వాటి పరిణామాలు ఎలా వుంటాయో చాలా బాగా చూపించిన సినిమా “జెస్సీ “. ప్రతి సన్నివేశం ఆసక్తిని కలిగిస్తుంది
ఈ చిత్ర దర్శకుడు అశ్వనీకుమార్ వి. మొదటి ప్రయత్నంలో నే అబుదారీ దృష్టిని ఆకట్టుకుంటాడు . ఆతను కథ, స్క్రీన్ ప్లే తో అనుభవమున్న దర్శకుడిలా ఈ సినిమాను రూపొందించాడు . కథ , కథనం , నటీనటుల పాత్రోచితంగా నటన , నేపధ్య సంగీతం సినిమాను ఆద్యంతం చూసేలా చేస్తాయి .
ఈ చిత్రంలో అషిమా నర్వాల్ , శ్రీతా చందన , అతుల్ కులకర్ణి , కబీర్ దుబాన్ సింగ్,అర్చన శాస్త్రి , విమల్ కృష్ణ , పావని గంగిరెడ్డి , అభినవ్ గోమాతమ్,అభిషేక్ మహర్షి , పూర్ణిమ మద్ గిల్ , సమీర్ హాసన్, సుధారాణి నటించారు .
ఛాయాగ్రహణం : సునీల్ కుమార్, సంగీతం : శ్రీచరణ్ పాకల . దర్శకుడు ఎవరి దగ్గర పనిచేయకుండా మొదటిసారి రూపొందించిన ఈ సినిమా అశ్వనీ కుమార్ కు మంచి పేరును తెచ్చిపెడుతుంది
సిద్ధార్థ్ నన్ను వాడుకున్నాడు… కానీ… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు