telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మోగిన నగారా…

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మసబ్‌ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి షెడ్యూల్‌ విడుదల చేశారు. అయితే బల్దియా ఎన్నికల నామినేషన్లు దాఖలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని. అంతేకాకుండా అభ్యర్థులు తమతమ నామినేషన్లను నేరుగా ఆర్వోకి సమర్సించాలన్నారు. అయియే పోలింగ్ కొరకు కావలసిన సిబ్బందిని ఇతర ప్రదేశాల నుంచి తెప్పించామనీ, నామినేషన్ రోజున నామినీతో పాటుగా మరో ముగ్గురని తెచ్చుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలను జీహెచ్ఎంసీ సిబ్బందితో నిర్వహించామన్నారు. ఇదిలా ఉంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1439 కాగా పోలింగ్ ప్రాంతాలు 532. అదేవిధంగా హైపర్ సెన్సిటివ్ కేంద్రాలు 1004, ప్రాంతాలు 308. క్రిటికల్ కేంద్రాలు 257గా ఉండగా ప్రాంతాలు 73గా ఉన్నాయి. అన్ని కలుపుకొని మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 2700 ప్రాంతాలు 913గా నిలిచాయి. అయితే ఈ ఎన్నికల నామినేషన్ చివరి గడువు 20కాగా 22న ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుండగా.. అసరమైతే డిసెంబర్‌ 3న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి, ఫలితాలు వెల్లడించనున్నట్లు వెల్లడించారు

Related posts