*సినిమా టైటిల్ : ‘ఆచార్య’
*నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు
*నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
*నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
* కథ, స్క్రీన్ ప్లే దర్శకుడు: కొరటాల శివ
*సంగీతం: మణిశర్మ
*విడుదల తేది: ఏప్రిల్ 29,2022
మెగాస్టార్ చిరంజీవి , ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తొలి సినిమా ‘ఆచార్య. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు శుక్రవారం( ఏప్రిల్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ ..
టెంపుల్ టౌన్ ధర్మస్దలికి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉంది. పక్కనే జీవధార నది..మరో ప్రక్క పాధ ఘట్టం అనే తండా… ధర్మానికి… ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి.. అయితే ధర్మ స్దలిలో పేరు ఉన్న ధర్మ అక్కడ లేదు. అక్కడ అధర్మం చోటు చేసుకున్నప్పు అమ్మవారే ఏదో రూపంలో వచ్చి ధర్మాన్ని నిలబెడుతుంటుంది. అమ్మవారి పాదాల చెంత ధర్మమే పరమావధిగా నివసిస్తున్న ఓ చిన్న తండాకి పాదఘట్టం అని పేరు.
ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ.. ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు. టెంపుల్ టౌన్ ధర్మస్థలిపై దుర్మార్గుడైన మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) అక్కడ రాజ్యం ఏలుతున్నాడు. ఆయన దేవాదాయ భూముల సొమ్ము అంతా నొక్కేస్తూంటాడు.
రాజకీయంగా ఎదగడం కోసం.. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు.
ఎదురొచ్చినవాళ్లని అంతం చేస్తూ అక్రమాలు కొనసాగిస్తుంటాడు. పాదఘట్టం జనాల్ని, ధర్మస్థలిని కాపాడేవారే లేరా అనుకునే సమయంలో అక్కడికి ఆచార్య (చిరంజీవి) అడుగు పెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. బసవన్న గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు.
ఆచార్య ధర్మస్థలిలోకి అడుగు పెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఆచార్య ఓ నక్సలైట్. అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ధర్మస్థలితో సిద్ధ(రామ్ చరణ్)కి ఉన్న అనుబంధం ఏంటి? ఆచార్యకి, సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
చిరంజీవి, రామ్‌చరణ్‌ల పాత్రల్ని, కథ నడిచే టెంపుల్ టౌన్‌నీ, ఇతరత్రా పాత్రల్ని బలంగానే డిజైన్ చేసినా… కథ కథనాల పరంగా మాత్రం దర్శకుడి పనితనం తేలిపోయింది.
చిరంజీవి సినిమా అంటే అభిమానులు, ప్రేక్షకులు మెగా మూమెంట్స్ ఆశిస్తారు. అందులోనూ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు అనేసరికి… అంచనాలు చాలా పెరిగాయి. దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు తీసిన చిత్రాలు అన్ని విజయాలు సాధించాయి.
కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఇప్పటిదాకా తీసిన ప్రతీ సినిమాతోనూ తనదైన ముద్ర వేసిన కొరటాల శివ…. ఈ సినిమాతో మాత్రం కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు.
టెక్నికల్ గా …
ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించేయడం మెగాస్టార్ ప్రత్యేకత. ‘ఆచార్య’గా తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. ఫస్టాఫ్ అంతా కథని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్స్ సీన్స్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.
ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ మీద తెరకెక్కించిన ‘బంజారా బంజారా…’ సాంగ్ ఆడియో పరంగా అంత హిట్ కాలేదు. కానీ, స్క్రీన్ మీద చూసినప్పుడు బావుంది. ముఖ్యంగా తండ్రీ తనయుల కెమిస్ట్రీ అదిరిపోయింది. అదొక్కటే కాదు… మిగతా సాంగ్స్ కూడా స్క్రీన్ మీద పర్వాలేదు. రామ్ చరణ్, పూజా హెగ్డేపై తెరకెక్కించిన నీలాంబరి సాంగ్, రెజీనా చేసిన ఐటమ్ సాంగ్, సంగీత కనిపించిన ‘లాహే లాహే…’ సాంగ్, కైలాష్ ఖేర్ సాంగ్ పాడిన ఒక ఎమోషనల్ సాంగ్ అన్నీ బానే ఉన్నాయి.
ఇక సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రామ్ చరణ్. ప్రతి సీన్‌లోనూ చిరంజీవితో పోటీపడీ నటించాడు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సెకండాఫ్‌లో సింహభాగం సిద్ధ పాత్రదే. సిద్ధని ప్రేమించే యువతి, సంగీతం టీచర్ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజాహెగ్డే.ఇక విలన్‌గా సోనూసూద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్‌గా జిషు సేన్ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్ చక్కటి నటనను కనబరిచారు. కామ్రేడ్ శంకర్ అన్నగా సత్యదేవ్ చాలా బాగా నటించాడు. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సినిమాకి కీలకం. నాజర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
చివరిగా..
‘ఆచార్య’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే… భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను డిజప్పాయింట్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా… టైమ్ పాస్ కోసం వెళ్ళిన ప్రేక్షకులకు సోసోగా అనిపిస్తుంది.
మా ఎన్నికలపై దర్శకేంద్రుడు స్పందన….