telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఏపీలో క‌రెంట్ లేదు, నీళ్ళు లేవు..రోడ్లు అధ్వానం ..

*మంత్రి కేటిఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
*ఏపీ సొంతూళ్ళ‌కెళ్ళి నా ఫ్రెండ్స్ చెబుతున్నారు..
*ఏపీలో ఉంటే న‌ర‌కంలో ఉన్న‌ట్టు ఉంటుందంటున్నారు..
*ఏపీలో క‌రెంట్ లేదు, నీళ్ళు లేవు..రోడ్లు అధ్వానం
*ఏపీలో రోడ్ల‌పై మండిప‌డుతున్నారు 
*దేశంలో బెస్ట్ సిటీ హైద‌రాబాద్‌..

దేశంలో బెస్ట్ సిటీ హైద‌రాబాద్ అని పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు ధ్వంసమై అధ్వాన్నంగా మారాయని తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ అన్నారు.

నేడు హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నందునే పరిశ్రమలు క్యూ కడుతున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పాలన అన్ని రకాలు మంచిగా ఉందన్నారు..

నా ఫ్రెండ్ ఒక ఆయ‌న పక్క రాష్ట్రం(ఏపీ)లో ప‌క్క రాష్రానికి వెళ్ళారు. ఆయ‌న‌కి అక్క‌డ‌ ఇల్లు, పొలాలు, తోటలున్నాయి. మొన్న సంక్రాంతికి ఆయన స్వగ్రామానికి వెళ్లొచ్చాక నాకు ఫోన్ చేశాడు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టే ఉంటుందని అన్నారు. 

కేటీఆర్ గారు.. తెలంగాణలోని అన్ని గ్రామాల నుంచి నాలుగేసి బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను పక్క రాష్ట్రాలకు పంపించండి అని సలహా ఇచ్చాడు. ఎందుకని నేనడిగితే… సంక్రాంతికి మా ఊరికిపోయి నాలుగు రోజులున్నాను సార్.. కరెంటు లేదు.

నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమైపోయాయి…పరిస్థితి దారుణంగా ఉంది. మళ్లీ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాతే నాకు ఊపిరి అందినట్లయిందని అని చెప్పాడు.

తాను చెప్పడం కాదని.. మన వాళ్లు కూడా ఒకసారి ఏపీకి  పంపిస్తే మ‌న ప్రభుత్వం ఎంత మంచి పరిపాలన అందిస్తుందో తెలిసొస్తుందని నాతో అన్నాడు’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

మరోవైపు తెలంగాణను అప్పుల రాష్ట్రం అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంపైనా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని.. కేసీఆర్ అప్పు చేసిన డబ్బులను నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగం కోసం ఖర్చు చేశామని.. తాము చేసే అప్పు భవిష్యత్ తరాల మీద పెట్టుబడి అవుతుందని వివరించారు.

అప్పుచేసి పప్పు బెల్లాలను పంచితే తప్పు అవుతుందని.. అప్పు చేసి పునరుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెడితే తప్పేంటని ప్రశ్నించారు.

Related posts