telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నగరంలో పెరుగుతున్న యాక్సిడెంట్స్.. అదే కారణం..?

Accident

భాగ్యనగరంలో రహదారులు రక్తం ఓడుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ లతో గాల్లో కలుస్తున్నాయి ప్రాణాలు. గత మూడు రోజులుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10మంది దుర్మరణం చెందారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు, ఆడిబాట్ల లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదాలకు రాష్ డ్రైవింగ్ ప్రధాన కారణం అని తెలుస్తుంది. నిబంధనలు పట్టించుకోని వాహనదారులు డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. ఆదిబాట్ల లో లో జరిగిన రోడ్డు ప్రమాదం ఇందుకు నిదర్శనం.  గంట కు 160కిలోమీటర్ల వేగంతో ఉన్న సఫారీ వాహనం డివైడర్ పై నుండి దూసుకువెళ్లి అవతలి రోడ్డు పై ఉన్న టు వీలర్ ను ఢీ కొట్టింది.  ఈ ప్రమాదం లో కొడుకు ప్రదీప్ రెడ్డి, తల్లి చంద్రకళ అక్కడిక్కడే మరణించారు. కారు లో ఉన్న శరత్ చంద్ర, ఇమాన్యుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి విషమం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ప్రజలు వరాహనాలను జాగ్రత్తగా నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related posts